Song: Gaali Chirugaali
Movie: Vasantham
Music: SA Rajkumar
Singers: KS Chitra
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2003
J7zE8hjQPIQగాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వని ఎన్నడు ఆగనీ పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకొను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీరాక ఆపేనా వాసంతమా ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన బెదిరేనీ నీ వాన ఆషాఢమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా కూరిమే సాక్షిగా ఓటమే ఓడగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వని ఎన్నడు ఆగనీ పయనమే నీదని
Gaali Chirugaali Ninu Choosindevaramma Velle Nee Daari Adi Yevariki Telusamma Roopame Undani Oopire Nuvvani Ennadu Aagani Payaname Needani
Gaali Chirugaali Ninu Choosindevaramma Velle Nee Daari Adi Yevariki Telusamma
Kanureppa Moosi Unnaa Nidaroppu Konu Annaa Ninu Niluvarinchenaa O Swapnamaa
Amavaasalennainaa Grahanaalu Emainaa Nee Kalanu Dochenaa O Chandramaa
Tana Odilo Unnadi Raayo Ratnamo Polchadu Nelamma Uli Gaayam Cheyyakapote Ee Sila Silpam Kaadamma Meluko Mitramaa
Gundelo Jwaalale Jyotigaa Maaragaa Cheekate Daarigaa Vekuve Cheradaa
Gaali Chirugaali Ninu Choosindevaramma Velle Nee Daari Adi Yevariki Telusamma
Chalikancha Kaapunnaa Pogamanchu Pommannaa Nee Raaka Aapenaa Vaasantamaa E Konda Raallainaa Ye Kona Mullainaa Bedirenaa Nee Vaana Aashaadamaa
Molakette Pachchani Aase Neelo Unte Chaalu Sumaa Kalakaalam Ninnu Anachadu Mannu Edige Vittanamaa Saagipo Nestamaa
Nityamu Todugaa Nammakam Undigaa Orime Shaakshigaa Otame Odagaa
Gaali Chirugaali Ninu Choosindevaramma Velle Nee Daari Adi Yevariki Telusamma Roopame Undani Oopire Nuvvani Ennadu Aagani Payaname Needani
