ప్రేమేనా... ప్రేమేనా...
హొ.. ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోన జరిగే ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే బాగుందే బాగుందే ఏదో బంధమే ఊగిందే నీకై హృదయమే
ద్వేషమే స్నేహమై... కష్టమే ఇష్టమై... దూరమే తీరమై.. భారమే తేలికై
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై భేదాలే చివరికి కలిసిన భావాలై ఏనాడో చినుకల్లే మొదలైనది ఈనాడే వరదైన వరమే ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే మోగిందే నాలో మౌనమే బాగుందే బాగుందే ఏదో బంధమే లాగిందే ఊహాలోకమే
ప్రేమేనా...
చూపులే చిత్రమై మాటలే మంత్రమై ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై
దేహాలే ప్రణయపు పూవుల దారాలై ప్రాణాలే మమతల మల్లెల హారాలై బ్రతుకంతా బ్రతికించే భావం ఇది ప్రతిరోజూ జన్మించే మార్గం ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే నువ్వంటే నా ప్రతిబింబమే ఆ ఆ ఆ బాగుందే బాగుందే ఏదో బంధమే నీకేలే నా సగభాగమే
ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోన జరిగే ఇది బాగుందే...
Premenaa.. Premenaa..
Ho Premincha Kotthaga Idi Premani Theliyaka Manasicha Poorthiga Naa Manasunu Adagaka Nuvvaina Nenaina Anukonidi Neelona Naalona Jarige Idee
Bagundhey Bagundhey Edo Bandhame Saaginde Neetho Paadhame Bagundhey Bagundhey Edo Bandhame Ooginde Neekai Hrudayame
Dweshamey.. Hey Snehamai Kastamey.. Hey Istamai Dooramey.. Hey Theeramai Bharamey.. Hey Thelikai
Panthaale Chilipiga Chadivina Paatalai Bedhaale Chivariki Kalisenu Bhaavalai Yenaado Chinukalle Modalainadi Eenade Varadaina Varame Idi
Bagundhey Bagundhey Edo Bandhame Moginde Naalo Mouname Bagundhey Bagundhey Edo Bandhame Laaginde Voohalokame
Premenaa..
Choopuley.. Hey Chitramai Maataley.. Hey Mantramai Oopirey.. Hey Ooyalai Navvuley.. Hey Vennelai
Dehale Pranayapu Puvvula Daaralai Praanale Mamathala Mallela Haaralai Brathukantha Brathikinche Bhavam Idi Prathi Roju Janminche Maargam Idi
Bagundhey Bagundhey Edo Bandhame Nuvvante Naa Prathibimbame Aa Aa Aa Bagundhey Bagundhey Edo Bandhame Neekele Naa Saga Bhagame
Premincha Kotthaga Idi Premani Theliyaka Manasicha Poorthiga Naa Manasunu Adagaka Nuvvaina Nenaina Anukonidi Neelona Naalona Jarige Idee Bagundhey...
