Song: Andalalo Aho Mahodayam
Movie: Jagadeka Veerudu Athiloka Sundari
Music: Ilaiyaraaja
Singers: SP Balasubramanyam, S Janaki
Lyricist: Veturi Sundara Ramamurthy
Cast: Chiranjeevi, Sridevi
Label: Aditya Music
Year: 1990
TnJKSmX2xXEలా లా లా.. లల లల లలా... లా లా ల లల లల లలా.. లా లా లా.. లల లల లలా..
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం
లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తళా తళా గళానా తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం
సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
LaaLaaLaLaa LaLaa LaLaa LaLaa.. LaaLaaLaaLaLaa LaLaa LaLaa LaLaa LaaLaaLaLaa LaLaa LaLaa LaLaa.. Laa HmmHmm Hmm Hmm Hmmm
Andalalo Aho Mahodayam Bhoolokame Navodhayam Puvvu Navvu Pulakinche Gaalilo Ningee Nelaa Chumbinche Laalilo Thaarallaaraa Raare Vihaarame
Andalalo Aho Mahodayam Naa Chupuke Subhodayam
Latha Lathaa Saraagamaade Suhasini Sumaalatho Vayassutho Vasanthamaadi Varinchele Saraalatho
Mila Milaa Himaale Jala Jalaa Muthyaalugaa Thala Thalaa Galaana Thatilladhaa Haaraalugaa
Chethulu Thaakina Kondalake Chalanamu Vachhenule Mundhuku Saagina Muchhatalo Muvvalu Palikenule Oka Swargam Thalavanchi Ila Chere Kshanaalalo
Andalalo Aho Mahodayam Bhoolokame Navodhayam Puvvu Navvu Pulakinche Gaalilo Ningee Nelaa Chumbinche Laalilo Thaarallaaraa Raare Vihaarame
Andalalo Aho Mahodayam Naa Chupuke Subhodayam
Sarassulo Sharatthu Kosam Thapassule Phalinchagaa Suvarnika Sugandhamedho Manassune Harinchagaa
Maraalinai Ilaage Maree Maree Natinchanaa Vihaarinai Ivaale Dhivi Bhuvi Sprushinchanaa
Grahamulu Paadina Pallavike Jaabili Oogenule Kommalu Thaakina Aamanike Koyila Puttenule Oka Soukhyam Thanuvanthaa Chelarege Kshanaalalo
Andalalo Aho Mahodayam Bhoolokame Navodhayam Neelaakasam Digivachhe Loyalo Oohaalokam Yedurochhe Haayilo Naalo Sage Yedo Saraagame
Andalalo Aho Mahodayam Bhoolokame Navodhayam
