Share This Site For Music Lovers

Ghal Ghal Song Lyrics - Nuvvostanante Nenoddantana

Song: Ghal Ghal
Movie: Nuvvostanante Nenoddantana
Music: Devi Sri Prasad
Singers: S.P.Balasubramanyam
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Siddharth, Trisha Krishnan
Label: Aditya Music
Year: 2005
tkMQxiMxHqk
PostTitle:ఘల్ ఘల్ సాంగ్ లిరిక్స్ Song:ఘల్ ఘల్ Movie:నువ్వొస్తానంటే నేనొద్దంటానా Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:యస్.పి.బాలసుబ్రమణ్యం Lyricist:సిరివెన్నెల సీతారామశాస్త్రి Cast:సిద్ధార్థ్, త్రిషా కృష్ణన్ Label:ఆదిత్య మ్యూజిక్

ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్

ఆకాశం తాకేలా వడ గాలై ఈ నెల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంల వినిపించే తడి గానం ప్రేమంటే

అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం

దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయందించి స్నేహం తో మొలకెతించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిట పెట్టె ముగ్గే ప్రేమంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్

ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితాలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగేమాలెరుగని మధురిమ ప్రేమంటే

ధరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్

మండే కొలిమినడగాంధే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే గాయాలే వరమాలై ధరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై వుండే విలువే ఉంటే అలాంటి మనసుకి తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వేతికే సంక్రాంతై ఎదురవదా

ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ గలం గలం గల ఘల్ ఘల్


Ghal Ghal Ghal Ghal Galam Galam Gala Ghal Ghal Ghal Ghal Ghal Ghal Galam Galam Gala Ghal Ghal

Aakasam Thakela Vadagalai Ee Nela Andhinche Ahwanam Premantee Aaratam Theerela Badhuliche Gaganamla Vinipinche Thadi Gaanam Premantee

Anuvanuvunu Meete Mamathala Mounam Padhapadhamante Nilavadhu Pranam Aaa Paruge Pranayaniki Srikaram

Daahamlo Munigina Chivuruki Challani Thana Cheyandhinchi Snehamtho Molakethinche Chinuke Premante Meghamlo Niddhura Poyina Rangulu Annii Rappinchi Maagani Mungita Pette Mugge Premante

Ghal Ghal Ghal Ghal Galam Galam Gala Ghal Ghal Ghal Ghal Ghal Ghal Galam Galam Gala Ghal Ghal

Praanam Epudu Modhalaindho Thelupagala Thedhi Edho Gurthinchendhuku Veelundha Pranayam Evari Hrudayamlo Epudu Udhayisthundho Gamaninche Samayam Vuntundha

Premante Emante Cheppese Matunte Aa Mataku Thelisenaa Premante Adhi Charithalu Saitham Chadhavani Vainam Kavithalu Saitham Palakani Bhavam Sarigemalerugani Madhurima Premante

Dhari Daati Vurakalu Vese Ye Nadhikina Thelisindha Thanaloo Ee Vuravadi Penchina Tholichinukedhante Siripairai Egire Varaku Chenuku Mathram Thelisindha Thanalo Kanipinche Kalalaku Tholi Pilupedhante

Ghal Ghal Ghal Ghal Galam Galam Gala Ghal Ghal Ghal Ghal Ghal Ghal Galam Galam Gala Ghal Ghal

Mande Koliminadagandhe Theliyadhe Mannu Kaadhu Idhi Swarnamantu Choopalante Pande Polamu Chebuthundhe Padhunuga Naate Nagali Pote Chesina Melante

Thanuvantha Viraboose Gayale Varamalai Dhari Chere Priyurale Gelupante Thanu Koluvai Vunde Viluve Vunte Alanti Manasuku Thanantha Thane Adagaka Dhorike Varame Valapante

Janmantha Nee Adugullo Adugulu Kalipe Jatha Vunte Nadakallo Thadabatina Natyam Ayipodha Reyanthaa Nee Thalapulatho Errabade Kannulu Vunte Aa Kanthe Nuvvethike Sankranthai Edhuravadhaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.