మనసున ఉన్నదీ చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో తెలపక పోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
ల ల ల లా... ల ల ల ల ల ల లా... ల ల ల లా... ల ల ల ల ల ల లా...
చింత నిప్పైన చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనె తియ్యని బాధని లేత గుండెల్లొ కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలనీ అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
ల ల ల ల లా... ల ల ల ల లా...
నీలి కన్నుల్లొ అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని వేల ఊహల్లొ ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో తెలపక పోతే ఎలా.. ఆ..
ల ల లా.. ల ల ల ల ల ల ల ల లా లా... ల ల లా.. ల ల ల ల ల ల ల ల లా లా...
Manasuna Unnadi Cheppaalanunnadi Maatalu Raave Elaa Maatuna Unnadi O Manchi Sangati Bayatiki Raade Elaa
Atadini Chooste Reppalu Vaalipoye Bidiyam Aapedelaa Eduruga Vaste Cheppaka Aagipoye Talapulu Choopedelaa
Okasaari Dari Cheri Yada Godavemito Telapakapote Elaa Manasuna Unnadi Cheppaalanunnadi Maatalu Raave Elaa
La La La Laa... La La La La La La Laa... La La La Laa... La La La La La La Laa...
Chinta Nippaina Challaga Undani Enta Noppaina Teliyaledani Tanane Talachukune Vedilo
Prema Antene Tiyyani Baadhani Leta Gundello Kondanta Baruvani Kottagaa Telusukune Velalo
Kanabadutondaa Naa Priayamaina Neeku Naa Yada Kota Ani Adagaalani Anukuntu Tana Chuttu Mari Tirigindani Telapakapote Elaa
Manasuna Unnadi Cheppaalanunnadi Maatalu Raave Elaa
La La La La La Laa... La La La La La Laa...
Neeli Kannullo Atani Bommani Choosi Naakinka Chotekkadundani Nidare Kasurukone Reyilo
Melukunnaayi Le Vinta Kaipani Vela Uhallo Uregu Choopuni Kalale Musurukune Haayilo
Vinabadutondaa Naa Priyamaina Neeku Aasala Raagam Ani Adagaalani Pagaledo Reyedo Gurute Ledani Telapakapote Elaa
Manasuna Unnadi Cheppaalanunnadi Maatalu Raave Elaa Maatuna Unnadi O Manchi Sangati Bayatiki Raade Elaa
Atadini Chooste Reppalu Vaalipoye Bidiyam Aapedelaa Eduruga Vaste Cheppaka Aagipoye Talapulu Choopedelaa
La La Laa.. La La La La La La La La La La Laa... La La Laa.. La La La La La La La La La La Laa...
