Song: Emani Cheppanu Prema
Movie: Seenu
Music: Mani Sharma
Singers: Hari Haran
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Venkatesh, Twinkle Khanna
Label: Aditya Music
Year: 1999
kPk2nYiZvwoఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం
ఓఓఓ... అలసట చెందిన కలలకు చందన మలదిన ఆశల్లో నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు చేసుకున్న శ్లోకం ప్రేమే అనుకోనా ఏ కంటిపాప చూడలేని స్వప్నం మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం ఎద నీడకేలే పయనం హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఓఓఓ... విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా హే కాంచనాల కన్నె చిలక పలికే కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా...
ఆ రాధకే నా గానం ఆరాధనే నా ప్రాణం నా గాథ ఇకపై మౌనం ఇది నా జీవనరాగం
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం
Emani Cheppanu Prema Egire Chilakamma Andani Aakaashaale Naa Teeraalamma
Emani Cheppanu Prema Egire Chilakamma Andani Aakaashaale Naa Teeraalamma
Udayaala Saayankaalam Hrudayaala Sandhyaaragam Oka Raadha Yamuna Teeram Edhalona Muraligaanam
Oo Oo Ho Ho, Alasata Chendhina KalalakuChandana Maladhina Aashallo Naa Mounabhashallo Nee Kanti Baasallo
Neevu Naaku Nenu Neeku Lokam Ankithaalu Chesukunna Shokam Preme Anukonaa Ye Kantipaapa Choodaleni Swapnam Manasulona Daagi Unna Gaanam Needhe Emaina
Oka Thodu Kore Praanam Edha Needakele Payanam Hrudayaalu Kore Gamyam Vedhike Premaavesham
E Emani Cheppanu Prema Egire Chilakamma Andani Aakaashaale Naa Teeraalamma
Oo Oo Ho Ho, Virahapu Yaathana Vidudala Korina Manasula Jantallo Sreerasthu Gantallo Srungaara Pantallo
Kougilintha Cherukunna Kaalam Kaalamantukoni Vintha Yogam Manashe Anukonaa Hey, Kanchanaala Kanne Chilaka Palike Kalavarintha Kantineeru Chilike Samayaalochhenaa
Aa Raadhake Naa Gaanam Aaraadhane Naa Praanam Naa Gaadha Ikapai Mounam Idhi Naa Jeevanaraagam
Emani Cheppanu Prema Egire Chilakamma Andani Aakaashaale Naa Teeraalamma
Udayaala Saayankaalam Hrudayaala Sandhyaaragam Oka Raadha Yamuna Teeram Edhalona Muraligaanam