Song: Aakasam Sakshiga
Movie: Adavi Ramudu
Music: KV Mahadevan
Singers: Sonu Nigam, Mahalakshmi Iyer
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Prabhas, Kajal Aggarwal
Label: Aditya Music
Year: 2004
ఆకాశం సాక్షిగా.. భూలోకం సాక్షిగా.. ఆకాశం సాక్షిగా.. భూలోకం సాక్షిగా.. నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ నిజం చెప్పనీ నిను పూజించాననీ
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమనీ నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని నిను స్వాగతించు బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా
నా శ్వాసే సాక్షిగా నీ ధ్యాసే సాక్షిగా నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ నిజం చెప్పనీ నిను పూజించాననీ
కొమ్మ పైన ఆ చిలక ఊసులేమి చెప్పింది బొమ్మ లాగ ఈ చిలక పరవశించి విన్నది పంజరాన చెర కన్నా పర్ణశాల మేలన్నది రాముడున్న వనమైనా రాణివాసమన్నది అన్నా అనుకున్నా అడవి అంతఃపురమవునా అయినా ఎవరైనా ఇది కొనగల వరమేనా
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమనీ నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని నిను స్వాగతించు బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా
ప్రతి నిమిషం సాక్షిగా మన పయనం సాక్షిగా నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ నిజం చెప్పనీ నిను పూజించాననీ
సప్తపదిన సాగమని ప్రేమ నడుపుతున్నదట ఏరికోరి ఇద్దరినీ ఎందుకల్లుకుందట నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమనేది ఉన్నదట నీవు నేను కలవనిదే తనకి ఉనికి లేదట ప్రణయం ఇక నుంచీ మన జతలో బతకాలి నిత్యం వికసించే మధులతగా ఎదగాలి
నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమనీ నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా నిను స్వాగతించు బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా
రవికిరణం సాక్షిగా తడి నయనం సాక్షిగా నిజం చెప్పనీ నిను పూజించాననీ నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
Aakasam Sakshiga.. Boolokam Sakshiga.. Aakasam Sakshiga.. Boolokam Sakshiga.. Nizam Cheppani Ninnu Preminchanani Nizam Cheppani Ninnu Poojinchanani
Niroopinchu Koni Nee Preme Naa Pranamani Nivedinsu Koni Nee Premaki Naa Hridayani Ninnu Swagadhinchu Brigi Kougalintanai Kaasta Kanchaga Nee Chelimi Nannu Srirama Rakshaga Paripalinsaga
Na Swase Sakshiga Nee Dhyase Sakshiga Nizam Cheppani Ninnu Preminchanani Nizam Cheppani Ninnu Poojinchanani
Komma Paina Aa Chilaka Oosuleni Cheppindi Bomma Laga Ee Chilaka Parasavasinchi Vinnadhi Panjharala Jarakanna Parnasala Menandi Ramudunna Vanamaina Rani Vasam Annadhi
Anna Anukunna Adivanta Puram Aunaa Aina Evaraina Idi Konagala Varamenaa
Niroopinchu Koni Nee Preme Naa Pranamani Nivedinsu Koni Nee Premaki Naa Hridayani Ninnu Swagadhinchu Brigi Kougalintanai Kaasta Kanchaga Nee Chelimi Nannu Srirama Rakshaga Paripalinsaga
Pratinimisham Sakshiga Mana Payanam Sakshiga Nizam Cheppani Ninnu Preminchanani Nizam Cheppani Ninnu Poojinchanani
Sapthapadiga Sagamani Premanoruku Thunnadata Eri Kori Idharini Endhukallu Kundata Ninnu Nannu Nammukune Premanedi Unnadata Neevu Nenu Kalavanidhe Thanaki Uniki Ledhata
Pranayam Ikanunchi Mana Jathalo Brathakali Nithyam Vikasinche Madhulataga Yadhagali
Nivedinsu Koni Nee Premaki Naa Hridayani Niroopinchu Koni Nee Preme Naa Pranamani Nee Chelimi Nannu Srirama Rakshaga Paripalinsaga Ninnu Swagadhinchu Brigi Kougalintanai Kaasta Kanchaga
Ravikiranam Sakshiga Thadinayanam Sakshiga Nizam Cheppani Ninnu Poojinchanani Nizam Cheppani Ninnu Preminchanani
