ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన
కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక నిన్నే తాకాలని నీతో గడపాలని ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది
ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక నువ్వే కావాలని నిన్నే కలవాలని మనసే విప్పాలని మాటే చెప్పాలని ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది
Yedo Yedo Ayipoyindi Yedalo Yedo Modalayyindi
Ninne Chudalani Nito Undalani Nene Odalani Nuvve Gelavalani Pade Pade Anipistundi Ni Pilupe Vinipistundi
Adi Premo Yemo Teliyano Vinta Yatana Adi Premo Nemo Yerugani Konte Bhavana
Kallemo Kalalu Mani Ninnu Vetukutunte Mansemo Panulu Mani Ninnu Taluchukunte
Kallu Nito Kalissi Nadavalani Kalavara Padutunte Cheyi Nito Chelimi Cheyyalani Tomdara Pedutunte
Vere Dhari Lekha Nadhare Nuvvayyaka Tiram Cherinaka Ee Keratam Aagaleka
Ninne Takalani Nito Gadapalani Manasemo Manasichhindi Vayasemo Chanuvicchindi
Adi Premo Yemo Teliyano Vinta Yatana Adi Premo Nemo Yerugani Konte Bhavana
Yedo Yedo Ayipoyindi Yedalo Yedo Modalayyindi
Aaratam Haddu Dati Mata Cheppamante Momatam Siggutoti Pedavi Vippanante
Uthasaham Ninne Pondalani Urakalu Vestunte Ullasam Nike Chendalani Parugulu Tistunte
Yemi Palu Poka Saga Palu Nuvvayyaka Sayam Vacchina Paruvam Aagaleka
Nuvve Kavalani Ninne Kalavalani Manase Vippalani Mate Cheppalani Ollanta Pulakistundi Tullinta Kaligistundi
Adi Premo Yemo Teliyano Vinta Yatana Adi Premo Nemo Yerugani Konte Bhavana
Yedo Yedo Ayipoyindi Yedalo Yedo Modalayyindi