ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు ఔనా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా అది మోయరాని భారమవుతున్నా చెప్పుకుంటే తప్పు లేదు అయినా నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా
లలలలా లలలలా లలలలా లలలలా లల లలలలలలలల లల లల లలలలలలలల లల
లల లలలలలలలల లల లలలలలలలల లల లలలలలలలలా...
జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా తగిన తరుణమని ఉదయ కిరణమై ఎదురుపడిన వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా
అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
తలపునే తెలుపవే నాలో ప్రాణమా పెదవిపై పలకవే ఊహా గానమా మదిని మీటినది నీవు కాదా మరి మధురమైన స్వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా
చెప్పనంటు దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు ఔనా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
Oh Premaa Premaa Premaa..
Manninchu O Prema Muripinchukokamma Mounalu Karigelaa Maatadumaa
Manninchu O Prema Marugela Cheppamma Dhari Cheru Dhaaredhina Choopinchumaa
Cheppakunda Daachadanikaina Antha Cheppa raani Maata Kadhu Avuna Intha Manchi Vela Edhurina Mari Cheppukova Inka Eppudina
Pattaraani Aasa Penchukunna Adhi Moyaraani Bhaaramouthunna Cheppukunte Thappuledhu Ayinaa Nuvvu Oppukovo Emo Anukunna
Oh Premaa Premaa Premaa..
Lalalalaa Lalalalaa Lalalalaa Lalalalaa Lala Lalalalalalalal Lala Lala Lalalalalalalal Lala
Lala Lalalalalalalala Lala Lalalalalalalala Lala Lalalalalalalalaa...
Manninchu O Prema Muripinchukokamma Mounalu Karigelaa Maatadumaa
Janta Kammani Venta Rammani Pilichey Nesthama Kontha DhooramaiKontha CheruvaiVuntey Nyayamaa
Rendu Chethulaa Andhukomani Anavem Snehamaa Chentha Nilichina Cheyi Kalapavem Naadhey Neramaa
Choravagaa Podhumuko Nadipey Pranayamaa Bidiyame Vadhuluko Bedhirey Priyathamaa
Tagina Tharunamani Udaya Kiranamai Edhurupadina Varama
Manninchu O Prema Muripinchukokamma Mounalu Karigelaa Maatadumaa
Anni Vaipulaa Chelimi Kaapala Alle Bandhamaa Mabbulo Alaa Dhaagithey Ela Dhigiraa Chandramaa
Nidhuralo Ala Nilichipokala Merisey Swapnama Kanti Papalo Kaburulemito Chebithe Paapama
Thalapuley Thelupavey Naalo Praanama Pedhavipai Palakavem Vooha Gaanamaa
Madhini Meetinadhi Neevu Kaadha Mari Madhuramaina Swarama.
Manninchu O Prema Muripinchukokamma Mounalu Karigelaa Maatadumaa
Cheppakunda Daachadanikaina Antha Cheppa raani Maata Kadhu Avuna Intha Manchi Vela Edhurina Mari Cheppukova Inka Eppudina
Oh Premaa Premaa Premaa.. Oh Premaa Premaa Premaa..