Song: Ooru Palletooru
Movie: Balagam
Music: Bheems Ceciroleo
Singers: Ram Miriyala, Mangli
Lyricist: Kasarla Shyam
Cast: Priyadarshi, Kavya Kalyanram
Label: Aditya Music
Year: 2023
ఓరి వారి ఇంక పిండుతున్నావురా పాలు ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క ఇగ పొద్దు పొద్దునే మొదలెట్టినావురా నీ పాసుగాల
కోలో నా పల్లే కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడె లాగల్లే యాప పుల్లల చేదు నమిలిందే రామ రామ రామ రామా తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగ బెట్టుకుందే బాయి గిరక నా పల్లే
హే తెల్లా తెల్లాని పాల దారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగ మోగుత ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోధా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్లొ తడిసిన ఈ మట్టి గంధాలు
ఆ ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టీ కొడుకు కిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే యెదుగుతున్నా సంబరాల పంట పైరు
వంద గడపలా మంద నా పల్లే గోడ కట్టని గూడు నా పల్లే సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే రామ రామ రామ రామా మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలొ ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే
ఆలు మొగలు ఆడే ఆటలూ అత్త కోడండ్ల కొట్లాటలూ సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ రచ్చ బండ మీద ఆటలూ ఛాయబండి కాడ మాటలూ వొచ్చి పోయెటోల్ల మందలించుకొనే సంగతే గమ్మతీ
తట్టబుట్టలల్ల కూరతొక్కులూ సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు మావి పూట కాసినట్టే మనుసులు ఊరంటే రోజు ఉగదే సచ్చేదాక ఉంటంది యాది
ఊరూ నా ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టీ కొడుకు కిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే యెదుగుతున్నా సంబరాల పంట పైరు
ఆ వంద గడపలా మంద నా పల్లే గోడ కట్టని గూడు నా పల్లే సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే రామ రామ రామ రామా మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలొ ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే
Kolo Na Palle Kodi Koothalle Vollirusukundhe Kode Lyagalle Yapa Pullala Chedhu Namilindhe Rama Rama Rama Rama Thalaku Bosukundhe Na Nela Thalle Aliki Boosukundhe Muggu Sukkalne Saddhi Mootalne Saga Bettukundhe Bayi Giraka Na Palle
Hey Thella Thellani Pala Dharalalla Palle Tellaruthuntadira Gulloni Gantalu Kadedla Medalona Jantaga Mogutha Untayira Nagali Bhujana Pettukunte Dosthulu Cheyesinattera Goddu Godha Pakkana Unte Kondantha Balagam Unnattura
Sallagali Mosukochenaa Senu Selkala Muchatlu Dari Podugu Setla Kommalaa Raluthunna Poola Chappatlu Gaddi Mopulu Kalva Gattulu Semata Sukkallo Thadisina Ee Matti Gandhala
Aa Ooru Palleturu Deeni Theere Amma Theeru Kongulona Dasipetti Kodukukiche Prema Veru Ooru Palleturu Deeni Theere Kannakuthuru Kandla Mundhe Edhuguthunna Sambarala Panta Pairu
Aa Vandha Gadapala Mandha Na Palle Goda Gattani Goodu Na Palle Seruvulla Thulleti Jella Shapole Rama Rama Rama Rama Mava Attha Bava Bapu Varasalle Oorantha Suttala Mulle Na Palle Daramlo Odigina Poola Dhandalle Rangula Singidi Palle
Alu Magalu Ade Atalu Attha Kodandla Kotlatalu Sadhiri Seppaleni Magani Thippale Thippalu Rachabanda Meeda Atalu Chaya Bandi Kada Matalu Vachi Poyetolla Mandhalichukune Sangathe Gammathi
Thatta Buttalalla Koora Thokkulu Sutta Buttalalla Beedi Kattalu Chethanaina Sayam Jese Manushulu Mavi Pootha Gasinatte Manasulu Oorantha Roju Ugadi Sachedhaka Untadi Yadhi
Aa Ooru Palleturu Deeni Theere Amma Theeru Kongulona Dasipetti Kodukukiche Prema Veru Ooru Palleturu Deeni Theere Kannakuthuru Kandla Mundhe Edhuguthunna Sambarala Panta Pairu
Aa Vandha Gadapala Mandha Na Palle Goda Gattani Goodu Na Palle Seruvulla Thulleti Jella Shapole Rama Rama Rama Rama Mava Attha Bava Bapu Varasalle Oorantha Suttala Mulle Na Palle Daramlo Odigina Poola Dhandalle Rangula Singidi Palle
