Share This Site For Music Lovers

Eedo Priya Raagam Song Lyrics - Arya

Song: Nuvvunte
Movie: Arya
Music: Devi Sri Prasad
Singers: Sagar, Sumangali (Chorus)
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Allu Arjun, Anu Mehta, Siva Balaji
Label: Aditya Music
Year: 2004
Llw7cXHmDDo
PostTitle:నువ్వుంటే సాంగ్ లిరిక్స్ Song:నువ్వుంటే Movie:ఆర్య Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:సాగర్, సుమంగళి (కోరస్) Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:అల్లు అర్జున్, అను మెహతా, శివ బాలాజీ Label:ఆదిత్య మ్యూజిక్

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా

ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

ఓ.. పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చెయ్యదా ప్రేమబాటలో పయనం

దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం

ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిత్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

ఓ.. ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా

మునిగి తేలుతున్నానా తననననన ఈ ముచ్చటైన మురిపాన తననననన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన ననన

హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే


Eedo Priyaraagam Vintunna Chirunavullo Prema Aa Sandadi Needena Yedo Nava Natyam Chustunna Sirimuvvallo Prema Aa Savvadi Needena

Ittage Kalakaalam Chudalanukuntunna Itupaina Ee Swapnam Kariginchaku Emaina Prema O Prema Chirakaalam Navente

Nuvvunte Nijamega Swapnam Nuvvunte Prati Maata Satyam Nuvvunte Manasantha Edo Tiyyani Sangeetham Nuvvunte Prati Adugu Andham Nuvvunte Prati Kshanamu Swargam Nuvvunte Ika Jeevitamantha Edo Santosham

Oo Paata Paadada Mounam Puri Vippi Aadada Praanam Adavinaina Poodota Cheyada Premabaatalo Payanam Daarichoopada Soonyam Aracheta Vaalada Swargam Elladaati Paravallu Tokkada Velluvaina Aanandam

Prema Nee Saawaasam Naa Swaasaku Sangeetham Prema Nee Sannithyam Naa Oohala Samraajyam Prema O Prema Gundello Kalakaalam

Nuvvunte Prathi Aasha Sontham Nuvvunte Chirugaale Gandham Nuvvunte Endaina Kaada Challani Saayantram Nuvvunte Prati Maata Vedam Nuvvunte Prati Paluku Raagam Nuvvunte Chirunavvulathone Nindenu Ee Lokam

Oo Unnachota Unnaana Aakasamandukunnaana Cheliyaloni Ee Kottha Sambaram Naaku Rekka Thodigena

Munigi Telutunnaana Thanananana Ee Mucchataina Muripaana Thanananana Aameloni Aananda Saagaram Nannu Munchu Samayaana Na Na Na

Hariville Nannalle Ee Rangulu Nee Valle Sirimallela Vaagalle Ee Vennela Neevalle Prema O Prema Idi Sashwathamanukona

Nuvvunte Digulantu Raadhe Nuvvunte Velugantu Podhe Nuvvunte Mari Maatalu Kooda Paataipotaaye Nuvvunte Edurantu Ledhe Nuvvunte Alupantu Raadhe Nuvvunte Ye Kastaalaina Entho Ishtaale


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.