Song: Meesamunna Nesthama
Movie: Sneham Kosam
Music: SA Rajkumar
Singers: Rajesh
Lyricist: P K Mishra
Cast: Chiranjeevi, Meena, Vijaya Kumar
Label: Aditya Music
Year: 2004
_l34KyGeN4wమీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ మీసమున్న నేస్తమా హోయ్
ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కధలు మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు
చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు
పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి మనలాగే అవికూడా విడిపోలేనంటాయి
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా
ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా
నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడా
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ
Meesamunna Nesthama Neeku Roshamekkuva Meesamunna Nesthama Neeku Roshamekkuva Roshamunna Nesthama Neeku Kopamekkuva
Kopamekkuva Kaani Manasu Makkuva Snehaniki Chelikaada Dosti Ki Sarijoda Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda Meesamunna Nesthama Hoi
Yetigattu Chebuthundhi Adugu Mana Chepa Veta Kadhalu Marri Chettu Chebuthundhi Panchukoni Thinna Saddhi Ruchulu
Cheruku Thota Chebuthundhi Adugu Aanaati Chilipi Panulu Tent-hall Chebuthundhi Ntr Stunt Bomma Kadhalu
Parugeduthu Padipothu Aa Noothullo Eetha Koduthu Yennello Gadichayi Aa Guruthulane Vidichayi...
Vayasantha Marachi Kerinthalade Aa Theepi Gnapakalu Kalakaalam Manathote Vennante Vuntayi Manalage Avi Kooda Vidipolenantayi
Meesamunna Nesthama Neeku Roshamekkuva Roshamunna Nesthama Neeku Kopamekkuva
Okka Thalli Santhanamaina Manalaaga Vundagalara Okaru Kaadhu Manam Iddharante Yevaraina Nammagalara..
Nuvvu Penchina Pilla Papalaku Kanna Thandrinaina Prema Panchina Theerulona Ne Ninnu Minchagalana
Ye Punyam Chesano Ne Nee Sneham Pondhanu Naa Pranam Needhaina Nee Chelimi Runam Theerena..
Neeku Seva Chesendhukaina Maru Janma Korukona Snehaniki Chelikaada Dosti Ki Sarijoda Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda
Meesamunna Nesthama Neeku Roshamekkuva Roshamunna Nesthama Neeku Kopamekkuva
Kopamekkuva Kaani Manasu Makkuva Snehaniki Chelikaada Dosti Ki Sarijoda Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda Meesamunna Nesthama Hoi
