Hayiga Amma Ollo Song Lyrics Telugu & English - Yagnam

Hayiga Amma Ollo Song Lyrics Telugu & English - Yagnam - 2004 - Gopichand
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Hayiga Amma Ollo Yagnam Mani Sharma Gopika Poornima, Vardhini Sirivennela Sitarama Sastry Gopi Chand, Sameera Benerjee Aditya Music 2004 12q5jkphMag

హాయిగా అమ్మ ఒళ్ళో
చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో
పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా

హాయిగా అమ్మ ఒళ్ళో
చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో
పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా

హరివిల్లుగ నవ్వుతు ఉంటే
ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే
కొండైనా వాగల్లె పొంగదా

నునుమెత్తగ నవ్వుతు ఉంటే
ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే
రాయైనా రత్నంగా మారదా

హాయిగా అమ్మ ఒళ్ళో
చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో
పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా

అగ్గిలా మండిపడే నీ పంతమంతా
తగ్గితే చాలుకదా నీ జంట ఉంటా
అడుగే వేయనుగా నువ్వాగమంటే
అల్లరే ఆపు నువ్వే చెలరేగుతుంటే

బుద్ధిగా ఉంటాను అంటే
నువ్వు నా బంగారు కొండ
ముద్దుగా నా మాట వింటే
నువ్వు నా ముత్యాల దండ
రాముణ్ణై మంచి బాలుణ్ణై నే ఉంటా చక్కా
ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంక

హరివిల్లుగ నవ్వుతు ఉంటే
ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే
కొండైనా వాగల్లె పొంగదా

నునుమెత్తగ నవ్వుతు ఉంటే
ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే
రాయైనా రత్నంగా మారదా

హద్దులే ఎరగనిది ఈనాటి స్నేహం
వద్దకే చేరదుగా ఏ చిన్న దూరం
ఎప్పుడూ వాడనిది ఈ పూల గంధం
జన్మలో వీడనిది ఈ రాగబంధం

గూటిలో గువ్వలు సాక్షి
గుడిలో దివ్వెలు సాక్షి
చెప్పుకున్న ఊసులే సాక్షి
చేసుకున్న బాసలే సాక్షి
దైవమా కాపు కాయుమా ఈ పసి జంటకి
కాలమా నువు రాకుమా ఈ పొదరింటికి

హరివిల్లుగ నవ్వుతు ఉంటే
ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే
కొండైనా వాగల్లె పొంగదా

నునుమెత్తగ నవ్వుతు ఉంటే
ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే
రాయైనా రత్నంగా మారదా


Hayiga Amma Ollo
Chinnari Papalle Navvamma
Tiyaga Komm Ollo
Punnaga Puvvalle Navvamma

Hayiga Amma Ollo
Chinnari Papalle Navvamma
Tiyaga Komma Ollo
Punnaga Puvvalle Navvamma

Harivilluga Navvutu Unte
Andallo Vennel Kayada
Chirujalluga Navvutu Unte
Kondina Vagalle Pongada

Nunu Mettaga Navvatu Unte
Mullyina Puvvalle Takada
Toli Podduga Navvutu Unte
Rai Ina Ratnanga Marada

Aggila Mandipade Ni Pantamanta
Taggite Chalu Kada Ni Janta Unta
Aduge Vayyanu Ga Nuvvu Aagamante
Allare Apunuvve Chellaregutunte

Buddiga Untanu Ante
Nuvvu Na Bengar Konda
Mudduga Na Maata vinte
Nuvvu Na Mutyal Dand
Ramudinai Manchi Baludnai
Ne Unta Chepta
Avvaru Ninnu Yamude Anukore Inka

Harivilluga Navvutu Unte
Andallo Vennel Kayada
Chirujalluga Navvutu Unte
Kondina Vagalle Pongada

Nunu Mettaga Navvatu Unte
Mullyina Puvvalle Takada
Toli Podduga Navvutu Unte
Rai Ina Ratnanga Marada

Haddule Eraganidi Yenaati Sneham
Vaddake Cheraduga Ye Chinna Dooram
Yeppudu Vadanidi Ee Poola Gandham
Janmalo Viddide Ee Ragabandha

Gutilo Guvvalu Sakshi
Gudilo Divvelu Sakshi
Cheppukunna Oosulu Sakshi
Chesukunna Basalu Sakshi
Daivama Kapu Kayuma Ee Pasi Jantaki
Kalama Nuvvu Rakuma Ee Podarintiki

Harivilluga Navvutu Unte
Andallo Vennel Kayada
Chirujalluga Navvutu Unte
Kondina Vagalle Pongada

Nunu Mettaga Navvatu Unte
Mullyina Puvvalle Takada
Toli Podduga Navvutu Unte
Rai Ina Ratnanga Marada


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.