Share This Site For Music Lovers

Jeevana Vahini Song Lyrics - Gangothri

Song:Jeevana Vahini
Movie:Gangothri
Music:MM Keeravani
Singers:MM Keeravani
Lyricist:Veturi Sundara Ramamurthy
Cast:Allu Arjun, Aditi Agarwal
Label:Aditya Music
Year: 2003
UyxtT1L73uM

ఓం ఓం ఓం

జీవన వాహినీ.. పావనీ.. కలియుగమున కల్పతరువు నీడ నీవని కనులుతుడుచు కామధేను తోడు నీవని వరములిచ్చి భయముదీర్చి శుభముకూర్చు గంగాదేవీ

నిను కొలిచిన చాలునమ్మ సకలలోకపావని భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రీ గంగోత్రీ గంగోత్రీ గంగోత్రీ

గలగలగల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి గలగలగల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి జీవన వాహినీ.. పావనీ..

మంచుకొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజావాహినీ విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవనీ

అత్తింటికి సిరులనొసగు అలకనందవై సగరకులము కాపాడిన భాగీరథివై బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రీ గంగోత్రీ గంగోత్రీ గంగోత్రీ

గలగలగల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి గలగలగల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి

పసుపూ కుంకుమతో పాలూ పన్నీటితో శ్రీగంధపుధారతో పంచామృతాలతో

అంగాంగము తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం

అమ్మా గంగమ్మా కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మా

జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లుపూలు పసుపులా పారాణి రాణిగా శివుని జటనమే తన నాట్య జతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా

గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని.. ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రీ.గంగోత్రీ గంగోత్రీ గంగోత్రీ

గలగలగల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి గలగలగల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి జీవన వాహినీ.. పావనీ


Om Om Om

Jeevana Vahini Pavani.. Kaliyugamuna Kalpatharuvu Needa Neevani.. Kanulu Thuduchu Kamadhenu Thodu Neevani.. Varamulichi Bhayamu Theerchi Shubamu Koorchu Ganga Devi..

Ninu Kolichina Chalunamma Sakala Loka Pavani.. Bhuvini Thadipi Dhiviga Malachi Sudulu Thirugu Shubagaatri.. Gangotri Gangotri.. Gangotri Gangotri..

Gala Galagala Gangotri.. Himagiri Dhari Hariputhri.. Gala Galagala Gangotri.. Himagiri Dhari Hariputhri.. Jeevana Vahini Pavani

Manchu Kondalo Oka Konda Vagula.. Ila Jananamondhina Viraja Vahini.. Vishnu Charaname Thana Puttinilluga.. Shivagiriki Cherina Suraganga Neevani..

Atthintiki Sirulanosagu Alakanandhavai.. Sagara Kulamu Kapadina Bhageeradhivai.. Badhareevana Hrusheekesha Haridwara Prayagamula.. Manikarnika Thanalopala Velasina Sri Varanasi.. Gangotri Gangotri.. Gangotri Gangotri..

Gala Galagala Gangotri.. Himagiri Dhari Hariputhri.. Gala Galagala Gangotri.. Himagiri Dhari Hariputhri..

Pasupu Kumkumatho Palu Penneeti Tho.. Sri Gandhapu Dhaaratho Panchaamruthalatho..

Angagam Thaduputhoo Dhoshalanu Kaduguthoo.. Gangotriki Jaruputhunna Abhyangana Snanam

Amma Gangamma Krishnammaku Cheppamma.. Kastam Kaliginchodani.. Yamunaku Cheppamma Sayamunaki Venakadodhani.. Godariki Kaveriki Yetiki Selayetiki Kuriseti Jadivanaki.. Dhooke Jalapathaniki Nee Thobuttuvulandari.. Cheppamma Maa Gangamma

Jeeva Nadhiviga Oka Mokshanidhivi Ga.. Pandlu Poolu Pasupula Paarani Raniga..

Shivuni Jatalane Thana Naatya Jathuluga Jalaka Maadu Sathulaku Soubaagya Dhaatriga..

Jala Dheevena Thalaku Pose Janani Ganga Bhavani.. Aame Anda Manchu Konda Vaadani Siga Poodhanda.. Gangotri Gangotri.. Gangotri Gangotri..

Gala Galagala Gangotri.. Himagiri Dhari Hariputhri.. Gala Galagala Gangotri.. Himagiri Dhari Hariputhri.. Jeevana Vahini Pavani


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.