హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగుఅడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
హే నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేనే లేను అని నీకు తెలపనీ
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
He Udayinchina Suryudinadigaa Kanipinchani Devudinadigaa Naa Gundelo Nee Gudinadigaa Nuvvekkadanee
Cheli Penchina Chikatinadigaa Chigurinchina Chandrudinadigaa Virabusina Vennelanadigaa Nuvvekkadanee
Chikkave He O Cheli Nuvvekkade Naa Jaabili Ikkade He Ekkado Unnaavu Anna Kaburu Telusule
Vecchani Nee Kaugili Chitraalu Chese Nee Chekkili Ippudu Eppudu Ne Maruvaleni Teepi Gurutule
Manasu Anta Nee Rupam Naa Praanamanta Nee Kosam Nuvvekkadekkadani Ani Vetiki Vayasu Alasi Poye Paapam
Nee Jaada Telisina Aa Nimisham Aha Antuleni Santosham Ee Lokam Anta Naa Sontam Idi Nee Prema Indra Jaalam
Adugu Adugunaa Nuvve Nuvve Nannu Taakene Nee Chirunavve Kalala Nundi O Nijamai Raave Nannu Cherave
Hoy Prema Paataku Pallavi Nuvve Gunde Chappudiki Taalam Nuvve Edanu Meetu Suswaramainaave Nannu Cherave
He Udayinchina Suryudinadigaa Kanipinchani Devudinadigaa Naa Gundelo Nee Gudinadigaa Nuvvekkadanee
Cheli Penchina Chikatinadigaa Chigurinchina Chandrudinadigaa Virabusina Vennelanadigaa Nuvvekkadanee
Nuvvu Leka Chirugaali Naa Vaipu Raanu Antondi Nuvvu Leka Vennela Kudaa Endalle Mandutondee
Kaasta Durame Kaadaa Mana Madhya Vocchi Vaalindi Duraanni Tarimi Vese Ghadiyaa Mana Dariki Cherukundi
Emi Maayavo Emo Kaanee Nuvvu Maatrame Naa Praanamai Nuvvu Unna Naa Manasantonde Ninnu Rammani
Hey Nuvu Ekkadunnaavo Gaani Nannu Kaasta Nee Chentaku Raani Nuvvu Leka Ne Lenule Ani Neeku Telapani
He Udayinchina Suryudinadigaa Kanipinchani Devudinadigaa Naa Gundelo Nee Gudinadigaa Nuvvekkadanee
Cheli Penchina Chikatinadigaa Chigurinchina Chandrudinadigaa Virabusina Vennelanadigaa Nuvvekkadani
Chikkave He O Cheli Nuvvekkade Naa Jaabili Ikkade He Ekkado Unnaavu Anna Kaburu Telusule
Vecchanee Nee Kaugili Chitraalu Chese Nee Chekkili Ippudu Eppudu Ne Maruvaleni Teepi Gurutule