తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా ఇది మరువబోకురా
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా ఇది మరువబోకురా
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ..
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా... వెనక్కి తగ్గమాకురా
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా
Telugu Bhasha Teeyadanam Telugu Jaati Goppatanam Telusukunnavaallaki Teluge Oka Muladhanam
Talli Tandri Nerpinatti Matrubhashara Telugu Marachipote Vaalani Nuvvu Marachinattura Idi Maruvabokuraa
Amma Anna Pilupulona Anuraagam Dhwanistundi Nanna Anna Padamulona Abhimanam Janistundi
Mummy Daddy Lona Aa Madhuryam Ekkadundi Mama Anna Maata Manasu Lotullo Nilustundi
Attha Ante Chalu Manaku Aadarana Labhistundi Aunty Uncle Lona Aa Apyayata Ekkadundi
Parabhasha Dhyananni Sampadinchu Parabhasha Dhyananni Sampadinchu Kaani Nee Bhasha Lone Nuvvu Sambhashinchu
Talli Tandri Nerpinatti Matrubhashara Telugu Matladi Nuvvu Valla Runam Teerchara Konta Runam Teerchara
Maa Telugu Talliki Mallepudanda Maa Kanna Talliki Mangalaratulu
Kommalloni Pakshulanni Tama Kutalani Marchukovu Bhumi Paina Pranulanni Tama Bhashanu Maruvalevu
Manushulamai Mana Bhashaku Musugulu Tagilistunnamu Prapanchana Medhavulu Mana Palukulu Mechinaru
Porugu Rashtra Kavulu Kuda Telugunu Tega Pogidinaru Andhrulamai Mana Bhashaku Anyayam Chestunnamu
Abhvruddiki Undali Ninge Haddu Abhvruddiki Undali Ninge Haddu Adi Basha Acharalanu Mingeyaddu Talli Tandri Nerpinatti Matrubhashara
Uggu Pala Bhasha Palikinanduku Siggu Padakura Venakki Taggamaakura
Telugu Bhasha Teeyadanam Telugu Jaati Goppatanam Telusukunnavaallaki Teluge Oka Muladhanam
Mummy Daddy Anna Maata Maruddamura Amma Nanna Antu Neti Nundi Piluddamura Pratigna Punudaamura
