ఆ.. ఆ.. లలలాలలా... లలలాలలా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని తరిమే బంధమిది
కల చెరగని కలలను చూడు కంటికి కావాలి నేనుంటా కల తరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
పంచుకున్న ఊసులూ పెంచుకున్న ఆశలూ తుళ్లితుళ్లి ఆడుతున్నవి కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళ వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈవేళ
అణువణువును తడిపిన ఈ తడి అమృతవర్షిణి అనుకోనా అడుగడుగున పచ్చని బాటను పరిచిన వనమును చూస్తున్నా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది
Kannula Logililo Vennela Virisindhi Challani Jabilitho Sneham Kudhirindhi Chelimi Thodunte Chalamma Lenidhi Emundhi Aasa Chitikesthe Chalamma Andhanidhemundhi
Kannula Logililo Vennela Virisindhi Challani Jabilitho Sneham Kudhirindhi
Gunnamavi Gonthulo Thene Thipi Nimputhu Koyilamma Cherukunnadhi Endamavi Dharilo Panchadhara Vaagula Kotha Pata Saguthunnadhi
Ontaraina Gundello Anandhala Andhelatho Aade Sandhadidhi Allibilli Kanthulatho Yekanthala Chikatini Tharime Bandhamidhi
Kala Theragani Kalalanu Choodu Kantiki Kaavali Nenutaa Kala Tharagani Velugulu Nedu Intiki Thoranamanukuntaa
Kannula Logililo Vennela Virisindhi Challani Jabilitho Sneham Kudhirindhi
Panchukunna Usulu Penchukunna Aasalu Thulli Thulli Aduthunnavi Kanche Leni Uhale Panchevanne Guvvalai Ningi Anchu Thakuthunnavi
Kotha Jallu Kurisindhee.. Brathuke Chiguru Thodigelaa Varamai Ee Vela Vaanavillu Virisindhee.. Minnu Mannu Kalisela Egase Ee Velaa..
Anuvanuvunu Thadipina Ee Thadi Amruthavarshini Anukonaa Adugaduguna Pachani Baatanu Parichina Vanamunu Choosthunnaa
Kannula Logililo Vennela Virisindhi Challani Jabilitho Sneham Kudhirindhi
Chelimi Thodunte Chalamma Lenidhi Emundhi Aasa Chitikesthe Chalamma Andhanidhemundhi
