Song: Naa Manasune
Movie: Manmadhudu
Music: Devi Sri Prasad
Singers: SP Balasubrahmanyam, KS Chithra
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nagarjuna, Sonali Bendre, Anshu
Label: Aditya Music
Year: 2001
ouZ-YO_Be2gనా.. మనసునే మీటకే నేస్తమా నా.. దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపితనమా చిరునవ్వులొని స్వరమా నా.. తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా.. మనసునే మీటకే నేస్తమా నా.. దారిలో చేరకే చైత్రమా
నా.. కెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్క సారి నీ.. వెంటపడే ఆశలకే చూపవా పూల దారి
చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగా తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగా లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా
నీ.. కనులలో వెలగనీ ప్రియతమా నీ.. పెదవికే తెలుపనీ మధురిమా
నీ.. ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను నీ.. ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను
అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా నన్ను నేను మరిచేంతల మురిపించకే ప్రేమా
నీ.. కనులలో వెలగనీ ప్రియతమా నీ.. పెదవికే తెలుపనీ మధురిమా
సరదాల చిలిపితనమా చిరునవ్వులొని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
Naa.. Manasune Meetake Nestamaa Naa.. Daarilo Cherake Chaitramaa Saradaala Chilipitanamaa Chirunavvuloni Swaramaa Naa Talapu Tatti Kadilinchake Kavvinchake Premaa
Naa Manasune Meetake Nestamaa Naa Daarilo Cherake Chaitramaa
Naa.. Kendukilaa Avutundi CheppavaaOkkasaaree Nee.. Ventapade Aasalaki Choopavaa Pooladaaree
Chinukalle Cheri Varadalle Maari Muncheste Teledelagaa Tadi Jaadaleni Tama Gundeloni Daahaalu Teeredelagaa Leni Poni Sayyaatatho Ventaadaake Premaa
Nee.. Kanulalo Velaganee Priyatamaa Nee.. Pedavakee Telupanee Madhurimaa
Nee.. Oohalalo Kontetanam Palakaristundi Nannoo Nee.. Oopirito Allukonee Pulakaristondi Vennoo
Alavaatupadina Eda Cheekatinta Sarikotta Vekuvai Raavaa Kiranaalu Padani Tera Chaatuloni Ekaantame Vadulukovaa Nannu Nenu Marichentalaa Muripinchake Premaa
Nee.. Kanulalo Velaganee Priyatamaa Nee.. Pedavakee Telupanee Madhurimaa
Saradaala Chilipitanamaa Chirunavvuloni Swaramaa Naa Talapu Tatti Kadilinchake Kavvinchake Premaa
