Song: Oh Priyathama
Movie: Nuvvu Naaku Nachav
Music: Koti
Singers: SP Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Cast: Venkatesh, Arti Agarwal
Label: Aditya Music
Year: 2001
mfpH9Uqd8xAఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా తొలి ప్రేమలోని మధుర భావనా
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా
ఓ ప్రితమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా
చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి
ఓ ప్రియతమ ఔననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
Aa Neeli Gaganaana Meriseti O Divya Thaara Ennenni Janmaalu Vechaanu Ne Ninnu Cheraa
Ye Naati Swapnam Nee Divya Roopam Sathakoti Raagalu Ravalinche Naa Gunde Lonaa
Oh Priyathama Idi Nijamaa Ee Parichayam Oka Varamaa Idi Manasu Padina Viraha Vedanaa Aa Tholiprema Loni Madhura Bhaavanaa Aa
Ye Muthyamu Ye Mabbulo Daagunnado Thelisedelaa Ye Snehamu Anubandhamai Odicheruno Thelipedela
Naa Gunde Podharinta Nee Kallu Vaalaka Ye Aasa Chigurincheno Vechani Nee Swaasa Naa Maenu Thadimaaka Ye Ooha Sruthi Minchenoo
Enni Janmaala Bandhaalu Sree Paarijaatalai Vichayo Cheppedela Enni Nayanalu Naa Vanka Choosayo Aa Guttu Vippedela
OhPriyathamaa Daya Ganumaa Nee Choope Chaalu Chandra Kiranamaa Naa Janma Dhanyamounu Praanama
Chiguraakulaa Pothillalo Vikasinchinaa Sirimallevo Chirugaalitho Selayetipai Narthinchinaa Nelavankavo
Navvemo Naajooku Nadumemo Pooreku Nee Andamemandune Palukemo Raachilaka Nadakemo Raayancha Vollantha Vayyarame
Nee Naamaanne Srungaara Vedangaa Bhavinchi Japisthunnane Cheli Nee Paadhale Naa Prema Soudhaalugaa Enchi Poojinchanaa Mecheli
Oh Priyathamaa Ounanu Maa Thana Leva Priyuni Hrudaya Vedanaa. Karuninchu Naaku Valapu Deevenaa Aa
Aa Neeli Gaganaana Meriseti O Divya Thaara Ennenni Janmaalu Vechaanu Ne Ninnu Cheraa
Ye Naati Swapnam Nee Divya Roopam Sathakoti Raagalu Ravalinche Naa Gunde Lonaa
